- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తెలంగాణ రక్షణ సేన’ దూకుడు.. 23 నియోజకవర్గాలకు ఇంచార్జీల ప్రకటన
తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రౌండ్ లెవల్‌లో బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రక్షణ సేన (TRS) స్పీడు పెంచింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ చీప్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక అడుగు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జీలను నియమిస్తూ ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ తొలి నియామకాల్లో కవిత తన లక్కీ నంబర్ సెంటిమెంట్‌ను ప్రతిబింబించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
లక్కీ నంబర్ ‘5’ వచ్చేలా తొలి విడత లిస్ట్..
తాజా నియామకాల్లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తన లక్కీ నంబర్ 5 వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదటి విడతలో భాగంగా సరిగ్గా 23 మంది నియోజకవర్గ ఇంచార్జీల జాబితాను ఆమె ఖరారు చేశారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 23 సంఖ్యలోని ఆ అంకెలను కూడితే ఐదు వస్తుంది. తన లక్కీ నంబర్ కలిసివచ్చేలా కవిత ఈ సంఖ్యను ఎంచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నడుస్తున్న ఆషాఢ మాసంలో శుభ ముహూర్తాన నియోజకవర్గ ఇంచార్జీలను కవిత ప్రకటించారు. తొలి విడతగా 23 స్థానాలకు ఇంచార్జీలను ప్రకటించగా.. రాబోయే రోజుల్లో మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రంలోని మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదే తరహాలో దశల వారీగా ఇంచార్జీల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లుగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.






