- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఐదు కొత్త కోర్సులు.. యూజీసీ అనుమతి
డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపిందని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు..

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపిందని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్, అకాడమిక్ రంగాల్లో ఎక్కువ డిమాండ్ ఉందని వివరించారు. కొత్తగా యూజీసీ ఆమోదం తెలిపిన కోర్సుల్లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్ డబ్ల్యూ), ఎంఎస్సీ జాగ్రఫీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నాయని ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. యూజీసీ ఎక్సపెర్ట్ కమిటీ జూన్‌లో వర్చువల్ గా తనిఖీ చేశారని, యూనివర్సిటీ లో ఉన్న మౌళిక వనరులను, అధ్యాపక సిబ్బంది, ఇతర అన్ని అంశాలను పరిశీలించాకే తదితర కోర్సులను ఆమోదించినట్లు తెలిపారు. ఈ కొత్త కోర్సులకు అనుమతి రావడంలో ప్రభుత్వ తోడ్పాటు ఉందన్నారు. విద్యా శాఖ కార్యదర్శి యోగిత రాణా రాష్ట్రంలోని టీచర్లకు ఓపెన్, డిస్టెన్స్ లర్నింగ్ ద్వారా ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశ్యం తో కోర్సులను రూపొందించగా యూజీసీ వాటికి ఆమోదం తెలిపిందని వివరించారు.
అత్యంత డిమాండ్ ఉన్న కోర్సులకు అనుమతి
ఎంఏ (ఎడ్యుకేషన్), ఎంఏ(స్కూల్ అడ్మినిస్ట్రేషన్), బీఈడీ(సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం) రాష్ట్రంలో విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తమ అర్హతలను, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందడానికి విధి నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు దోహదపడతాయని ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణను అందించే విషయమై త్వరలోనే విద్యా శాఖతో అవగాహనా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్ డబ్ల్యూ), జ్యాగ్రఫీలో ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ అత్యంత డిమాండ్ ఉన్న పీజీ కోర్సులని తెలిపారు. యూజీసీ కొత్తగా ఆమోదం తెలిపిన ఈ కోర్సుల కోసం కనీస అర్హత, అడ్మిషన్ విధానం, ఫీజుల వివరాలు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్లు వివరాలతో యూనివర్శిటీ త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని వివరించారు. తాజా సమాచారం కోసం విద్యార్థులు యూనివర్శిటీ వెబ్‌సైట్ www.braou.ac.in లేదా www.braouonline.in ను సందర్శించాలని, లేదా హెల్ప్ డెస్క్ 040- 23680 333 / 555 లో సంప్రదించాలని సూచించారు.






