- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా అన్నను కొట్టి చంపారు.. మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు
నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుకొండలు మృతి చెందడంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా మనుబోలు(Manubolu) పోలీసులపై లాకప్ డెత్(Lockup Death) ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం దొంగతనం కేసు(Gold Theft Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుకొండలు మృతి చెందడంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడుకొండలను కొట్టి చంపేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఐదు రోజుల పాటు లాకప్‌లో ఉంచి కొట్టి చంపేశారని మండిపడ్డారు. ‘‘బంగారం దొంగతనం కేసులో ఏడుకొండలును శనివారం తీసుకెళ్లారు. రాత్రంతా కొట్టారు. మనుబోలు ఎస్సైతో పాటు పొదలకూరు ఎస్సై హనీఫ్, కానిస్టేబుల్ మాధవ్ కలిసి చిత్రహింసలు పెట్టారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉంచారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. మీ అన్న చనిపోయారని ఎస్సై హనీఫ్ ఫోన్ చేశారు. కానిస్టేబుల్ మాధవ్ సొంత కారులో ఏడు కొండలను తీసుకెళ్లి మూడు గంటల పాటు తిప్పారు. విచారణ చేసిన రోజు మా అన్నను వదిలిపెట్టలేదు. బంగారం, దొంగతనం కేసులో మా అన్న ఏడుకొండలను తీసుకెళ్లారు. చంపేస్తారని మేము అనుకోలేదు. మాధవ్ సొంత కారులోనే ఏడుకొండలు మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏడుకొండలు లాకప్ డెత్‌పై విచారణ జరపాలి.’’ అని మృతుడి సోదరుడు రవి తెలిపారు.






