చంద్రబాబు అజెండానే రేవంత్ అమలు చేస్తున్నారు: కేటీఆర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-26 13:59:36  IST  )

బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో చంద్ర‌బాబు అజెండానే రేవంత్ రెడ్డి అమ‌లు చేస్తున్నార‌ని మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. తెలంగాణ‌లో ప‌నుల‌న్నీ చంద్ర‌బాబు కోవ‌ర్టులే చేస్తున్నార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పార‌ని అన్నారు.

చంద్రబాబు అజెండానే రేవంత్ అమలు చేస్తున్నారు: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో చంద్ర‌బాబు అజెండానే రేవంత్ రెడ్డి అమ‌లు చేస్తున్నార‌ని మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. తెలంగాణ‌లో ప‌నుల‌న్నీ చంద్ర‌బాబు కోవ‌ర్టులే చేస్తున్నార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పార‌ని అన్నారు. చంద్ర‌బాబుకు పెద్ద కోవ‌ర్టే సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. అందుకే గోదావ‌రి నీళ్ల‌ను వాళ్ల‌కు అప్ప‌జెప్పే విష‌యంలో రేవంత్ రెడ్డి క్లారిటీతో ఉన్నారని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి మోడీ క‌లిసి కేసీఆర్ అస్తిత్వాన్ని రాష్ట్రంలో లేకుండా చేయాల‌ని కుట్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఇది అర్థం చేసుకోవాల‌ని లేదంటే తెలంగాణ న‌ష్ట‌పోతుంద‌ని అన్నారు. బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో 3వేల టీఎంసీల నీళ్లు పోతున్నాయ‌ని దీనిపై కేంద్రంలో ఉన్న బీజేపీ స్పందించాల‌న్నారు. గోదావ‌రి నిక‌ర జ‌లాల్లో 950 టీఎంసీలు, మిగులు జ‌లాల్లో 1950 టీఎంసీలు తెలంగాణ‌కు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేయాల‌న్నారు. కానీ ఏ ప‌ర్మిష‌న్ లేకుండా ప్రాజెక్టు క‌డ‌తామని చంద్ర‌బాబు రేవంత్ మాట్లాడుకుని తెలంగాణ ప్ర‌జ‌ల గొంతుకోస్తున్నార‌న్నారు.

Read more : ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Next Story