దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు: CM రేవంత్‌కు కేటీఆర్ సవాల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-20 12:19:20  IST  )

దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు: CM రేవంత్‌కు కేటీఆర్ సవాల్

దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు: CM రేవంత్‌కు కేటీఆర్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా దొరికారని బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దమ్ముంటే వారితో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందని అన్నారు. గతంలో ఏడు ఉప ఎన్నికలు వస్తే అన్నింట్లోనూ ఓడిపోయారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనంతో సమస్యలు తప్పవని అన్నారు. మూడు కార్పొరేషన్లు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని ఆరోపించారు. అంతకుముందు యూరియా సమస్యపైనా కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తోందని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా పథకాల అమలును అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.

రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. సాగుకు అవసరమైన కరెంట్ సరఫరాను కూడా అస్తవ్యస్తం చేసి, అన్ని అంశాల్లో ప్రజలను పట్టిపీడిస్తోందని ధ్వజమెత్తారు. రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేమివల్లనే నేడు పల్లెల్లో అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు.

READ MORE ....

కాంగ్రెస్ సర్కార్ చేతగానితనానికి 'యూరియా యాప్' ఒక నిదర్శనం: కేటీఆర్

Next Story