- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ మనవడిపై కేటీఆర్ కామెంట్స్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్‌కి తెర లేపిందని కేటీఆర్(KTR) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్‌కి తెర లేపిందని కేటీఆర్(KTR) ఆరోపించారు. అందుకే 9,292 ఎకరాల భూమి ధారాదత్తం చేసేందుకు HILTP పాలసీ తీసుకువచ్చిందని కేటీఆర్ అన్నారు. గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి పారిశ్రామిక వ్యక్తులకు గత ప్రభుత్వాలు ఇచ్చాయి. అప్పటి మార్కెట్ రేట్‌కి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను అందించడం జరిగింది. కానీ ఈరోజు హైదరాబాద్‌లో ఉన్న 20 పారిశ్రామిక వాడలలోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం వచ్చిన భూములను ఈరోజు ప్రైవేటు వ్యక్తులు అపార్ట్‌మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. మేము గతంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50% ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50% ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చాము.
కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం దారాదత్తం చేస్తున్నది. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా ఒకప్పటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నది. ఈ విధంగా ఐదు లక్షల కోట్ల రూపాయల భూముల స్కామ్‌కు తెరలేపింది. ఈరోజు రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, ముని మనవడు వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ ద్వారా ఆయన అంబానీ సరసన నిలవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది అన్నారు. అంత భారీగా దోపిడీ చేసేందుకు ఆయన తెరలేపారు. ఇలా లక్షలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా చేస్తున్న ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్త పరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థి నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.
హైదరాబాద్ నగరంలో పార్కులకు, ఇళ్లకు, చివరికి శ్మశానానికి కూడా జాగా లేకున్నా, ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములన్నింటినీ అప్పనంగా అప్పగిస్తున్నది. ఇదే అంశాన్ని ఈరోజు మన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనరల్ బాడీ కౌన్సిలింగ్ సమావేశంలో నిలదీశారని తెలిపారు. 9300 ఎకరాల హైదరాబాద్ భూములను, ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా చేస్తామంటే ఊరుకోమని, అది కాంగ్రెస్ పార్టీ అబ్బ జాగీరు కాదని ప్రశ్నించినట్లు తెలిపారు.
Read More... ఆ బాధ్యత మనదే.. కేటీఆర్ సంచలన పిలుపు
Bandi Sanjay: చెక్ డ్యామ్‍లపై మీ విజిలెన్స్ విచారణ ఏమైంది?.. సీఎంకు బండి సంజయ్ లేఖ






