- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో దారుణం.. చీరలు కొనలేదని భర్తను కుక్కర్‌తో కొట్టిచంపిన భార్య
ఇటీవల కాలంలో భర్తలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఆరునెలల్లోనే 554 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు. కాగా తాజాగా మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భర్తలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఆరునెలల్లోనే 554 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు. కాగా తాజాగా మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఠాణె ప్రాంతంలో హరేరామ్ సింగ్ (35), సునీతాదేవి(౩౦) భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. సునీతాదేవి స్వస్థలం బిహార్ లోని రోహతాస్ జిల్లా కాగా, హరేరామ్ మహారాష్ట్రలోని ఠాణెకు చెందినవాడు. వీరిద్దరు కొన్నేళ్ల క్రితం పెద్దలుకుదిర్చిన వివాహం చేసుకుని కలిసి మెలిసి ఉంటున్నారు. కాగా శనివారం దంపతులు ఇద్దరి మధ్య చీరల విషయంలో గొడవ జరిగింది. ఎన్నిసార్లు అడిగినా చీరలు కొనివ్వడంలేదని సునీతాదేవి తన భర్తతో గొడవపెట్టుకుంది.
ఈ క్రమంలో గొడవ ముదరడంతో ఇద్దరి మధ్య వాదనలు పెరిగి కోపంతో రగిలిపోయిన సునీత కుక్కర్ మూతతో భర్తను చావగొట్టింది. అక్కడితో ఆగకుండా గొంతునులిమి హత్య చేసింది. అనంతరం ప్రమాదవశాత్తు తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి పోస్టుమార్టం చేయడంతో అసలు నిజం బయటపడింది. చీరల విషయంలో గొడవ జరగడంతో తానే భర్తను హత్య చేసినట్టు సునీతాదేవి ఒప్పుకుంది. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.






