- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీశైలం జాతీయ రహదారి ఘాట్ రోడ్డుకు సమీపంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేసుమోల్ల లక్ష్మి(38) అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ పెరుముల నాగరాజు తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతురాలు లక్ష్మి హైదరాబాద్‌లో కూలీ పని చేసి, తన స్వగ్రామమైన తుర్కపల్లి గ్రామానికి చిట్టి డబ్బులు చెల్లించేందుకు వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో తుర్కపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సిద్దాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






