ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ముందు పటిష్ట భద్రత

by Jakkula.Mamatha |

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నివాసాలు, క్యాంపు కార్యాలయాల ముట్టడికి బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వేములవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ముందు పటిష్ట భద్రత
X

దిశ, వేములవాడ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నివాసాలు, క్యాంపు కార్యాలయాల ముట్టడికి బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వేములవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ పట్టణంతో పాటు సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేసి సమీప పోలీస్ స్టేషన్లలోకి తరలించారు. ఈ క్రమంలో వేములవాడ పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నివాసం చుట్టూ పక్కల ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి, నివాసానికి నలుదిక్కుల బారికేడ్లు ఏర్పాటు చేసి అటుగా వెళ్ళే వారి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే పంపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

Next Story