- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత భవిష్యత్‌ను దెబ్బ తీసిందే మీరు.. మోడీకి రాహుల్ ఘాటు రిప్లై
దేశంలోని యువత, విద్యార్థుల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంటూ ప్రధాని మోడీ చేసిన ట్వీట్ పై రాహుల్ గాంధీ స్పందించారు. దేశ యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసేందే మీరు అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని యువత, విద్యార్థుల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంటూ ప్రధాని మోడీ చేసిన ట్వీట్ పై రాహుల్ గాంధీ స్పందించారు. దేశ యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసేందే మీరు అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. విద్యావ్యవస్థను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని నాశనం చేసేలా అనుమతి ఇచ్చారని, వారిని ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాధ్యలైన ప్రతి ఒక్కరినీ మీరే కాపాడారంటూ ఆరోపించారు. విద్యార్థుల డిమాడ్లు స్పష్టంగా ఉన్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలన్నారు.
విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, వారిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని మరోసారి రాహుల్ మూడు డిమాండ్లను మోడీ ముందు పెట్టారు. ఇదిలా ఉంటే మోడీ చేసిన ట్వీట్‌లో కేవలం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూస్తామని మాత్రమే హామీ ఇచ్చారు. కానీ విద్యార్థులు చేస్తున్న నిరసనలో స్పష్టంగా పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడంలేదు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు మద్దతు పెరుగుతోంది.






