అశ్వాపురంలో బస్సు బీభత్సం.. క్షణాల్లో గాల్లోకి తేలిన చక్రాలు!

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకుంది.

అశ్వాపురంలో బస్సు బీభత్సం.. క్షణాల్లో గాల్లోకి తేలిన చక్రాలు!
X

దిశ అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై పాల్వంచ నుంచి మణుగూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఉలిక్కిపడిన ప్రయాణికులు దిగి చూడగా బస్సు గాల్లో తేలియాడుతున్నట్లు కనిపించేసరికి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులకు ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆర్.అండ్.బి వారు ఇప్పటికైన సరైన సైన్ బోర్డు లు సిగ్నల్ సింబల్స్ లైటింగ్ భద్రత ఏర్పాటు చేయాలని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. నెలలో ఒక సంఘటన జరుగుతున్న కనీస స్పందన కరువైన ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం ఇకనైనా విడాలని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story