- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
by Ajay Maddhiboyina |
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందంటూ గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుండి మెయిల్ ద్వారా బెదింరిపులు వచ్చాయి.

X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందంటూ గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుండి మెయిల్ ద్వారా బెదింరిపులు వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు విమానాశ్రయం ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఎయిర్ పోర్టులో ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదు. టేకాఫ్ అయిన విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో బయలుదేరిన విమానాల సిబ్బందికి సైతం సమాచారం అందించారు, అయితే ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు ఎయిర్ పోర్టుకు ఇలానే బెదిరింపులు వచ్చాయి. చాలా సందర్బాల్లో ఆకతాయిలు బెదిరింపు కాల్స్ చేసినట్టు తేలింది.
Next Story






