- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతకు PM మోడీ బిగ్ రిలీఫ్.. పేపర్ లీకేజీ ఘటనపై సంచలన నిర్ణయం
పేపర్ లీకేజీలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస పేపర్ లీకేజీ ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు, నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చేసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను (Fast-Track Courts) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రధాని మోడీ ‘X’ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత శాఖలు, అధికారులకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో శరవేగంగా న్యాయం..
అయితే, పేపర్ లీకేజీలకు పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్న క్రిమినల్ ముఠాలకు త్వరగా శిక్ష పడేలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా అడ్డుకట్ట వేయవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయం విద్యార్థుల హక్కులు, ప్రయోజనాలను రక్షించే దిశగా తీసుకుంటున్న కీలక అడుగుగా వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే మాకు ఏదీ ఎక్కువ కాదని ప్రధాని మోడీ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. విద్యార్థుల జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు. వారికి చట్టపరంగా కఠినమైన శిక్ష అమలయ్యేలా చూస్తామని ప్రధాని మోడీ భరోసానిచ్చారు.






