- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ DGP కార్యాలయంలో సెన్సేషన్.. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ (DGP) కార్యాలయంలో ఇవాళ ఉదయం సంచలనం చోటుచేసుకుంది. సర్వీస్ తుపాకీతో కాల్చుకుని సెంట్రీగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ స్వామి (Swamy) అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం నైట్ షిఫ్ట్ డ్యూటీ వచ్చిన స్వామి ఉదయం సరిగ్గా 5.30కి వాష్‌రూమ్ వెళ్లి అక్కడే పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్‌తో షూట్ చేసుకుని రక్తపు మడుగులో పడిపోయాడు. అనంతరం గమనించిన తొటి సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించాలని అనుకున్నప్పటికీ అప్పటికే మృతిచెందాడు. ఇక స్పాట్‌కు వెళ్లిన సైఫాబాద్ పోలీసులకు ఓ సూసైడ్ నోట్ కూడా లభించింది. అందులో మృతుడు స్వామి తన భార్య, పిల్లలను ఏమీ అనవద్దని రాసి ఉన్నట్లుగా గుర్తించారు. అదేవిధంగా కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఆత్మహత్యకు కారణం ఇద్దరని లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అసలు స్వామి ఆత్మహత్యకు గల కారణలు ఏంటి? చివరిగా ఫోన్‌లో ఎవరితో మాట్లాడాడు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రస్తుతం డీజీపీ కార్యాలయానికి క్లూస్ టీమ్ (Clues Team)తో పాటు సైఫాబాద్ పోలీసులు (Sifabad Police) చేరుకుని పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు. పంచానామా అనంతరం స్వామి డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు రెండు స్వామి డీజీపీ కార్యాలయంలో సెంట్రీగా విధులు నిర్వర్తిస్తున్నాడని తొటి సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






