వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్న 'జీ నెట్‌వర్క్'.. టాప్ బ్యానర్లతో బిగ్ డీల్

by Pulgam srinivas |

జీ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యాలను కొనసాగిస్తూ, డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్, ఓటీటీ హక్కులను దక్కించుకుంటున్నట్లు సమాచారం.

వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్న జీ నెట్‌వర్క్.. టాప్ బ్యానర్లతో బిగ్ డీల్
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందిన ఓటీటీ, శాటిలైట్ సంస్థల్లో జీ సంస్థ ఒకటి. చాలా కాలం క్రితమే శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంది. ఓటీటీ విప్లవం ప్రారంభమైన తర్వాత డిజిటల్ రంగంలోకి కూడా ప్రవేశించి 'జీ5' ఓటీటీ వేదికను విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా పలు చిత్రాల పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) రంగంలోనూ చురుకుగా వ్యవహరిస్తోంది. శాటిలైట్, ఓటీటీ, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలతో జీ సంస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఈ భాగస్వామ్యాల ద్వారా ఆయా బ్యానర్లు నిర్మించే చిత్రాల డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్, ఓటీటీ హక్కులను దక్కించుకునే దిశగా సంస్థ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. జీ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, వృద్ధి సినిమాస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, వాటి చిత్రాల డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్, ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story