VIRAL: నేను ఇంకా బతికే ఉన్నాను.. ఆస్పత్రి నుంచి వాంగ్‌చుక్ సంచలన వీడియో

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 03:48:18  IST  )

దేశ రాజధాని వేదికగా 26వ రోజు నిరాహార దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్ ఆస్పత్రి నుంచి సంచలన వీడియోను విడుదల చేశారు.

VIRAL: నేను ఇంకా బతికే ఉన్నాను.. ఆస్పత్రి నుంచి వాంగ్‌చుక్ సంచలన వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేపడుతున్న ప్రముఖ వాతావరణ ఉద్యమకారుడు, సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తాజాగా స్పెషల్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. ‘నేను ఇంకా బతికే ఉన్నాను, ఇక్కడే జంతర్‌మంతర్ వద్దే ఉన్నాను’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే, గత 26 రోజులుగా ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్, లడఖ్ ప్రాంతానికి రాజ్యాంగపరమైన రక్షణలు కల్పిస్తూ ఆరో షెడ్యూల్ చేర్చాలని, ఇటీవల ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు.

కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కావాలి..

సోనమ్ వాంగ్‌‌చుక్ విడుదల చేసిన వీడియాలో ఆయన మాట్లాడుతూ.. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే తమ డిమాండ్లపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక హామీ వస్తేనే తాను నిరాహార దీక్షను విరమిస్తానని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని, విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చర్చలకు ముందుకొస్తే అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.

Next Story