ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా కేటీఆర్

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని విద్యార్థులు చేస్తున్న నిరస‌న‌కు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్వీ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది.

ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా కేటీఆర్
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని విద్యార్థులు చేస్తున్న నిరస‌న‌కు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్వీ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఇందిరా పార్కులో ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని కేటీఆర్ నిర్ణ‌యించారు. ఇక ఇప్ప‌టికే ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు దేశంలోని ఇత‌ర పార్టీలు త‌మ మ‌ద్దుతు ప్ర‌క‌టిస్తున్నాయి. శివ‌సేన పార్టీ నేరుగా ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి త‌మ మ‌ద్దతు తెలిపింది. ఎన్సీపీ సైతం విద్యార్థుల త‌ర‌పున ప్ర‌ధాని మోడీకి ఓ నివేధిక ఇచ్చింది.

అందులో ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ను ప‌ద‌వి నుండి తొల‌గించాల‌ని కోరింది. వీటితో పాటు కూట‌మేత‌ర పార్టీలు అన్నీ దాదాపు విద్యార్థుల నిర‌స‌న‌ల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఆ డిమాండ్ పై నోరుమెద‌ప‌డంలేదు. తాజాగా ప్ర‌ధాని మోడీ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించి నిందితుల‌ను శిక్షించ‌డానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికి విద్యార్థుల ఆగ్ర‌హ జ్వాల‌లు చ‌ల్లార‌డంలేదు.

Next Story