- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ది ప్యారడైజ్' అప్పటికైనా రెడీ అవుతుందా?.. మిగిలి ఉన్న పోర్షన్స్ ఇవే
'ది ప్యారడైజ్' చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌తో పాటు ఐటమ్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత వీరి కాంబోలో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మొదట ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఆ తేదీ వాయిదా పడింది. అనంతరం ఆగస్టు 21ను కొత్త విడుదల తేదీగా ప్రకటించినప్పటికీ, ఆ రోజున కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఇంకా పెద్ద స్థాయిలో షూటింగ్ పెండింగ్‌లో ఉండటంతో, సెప్టెంబర్‌లోనైనా సినిమా విడుదలవుతుందా అనే సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన భారీ క్లైమాక్స్‌తో పాటు ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ పూర్తి కావలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీలక భాగాలను పూర్తి చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మేకర్స్ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఖయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.






