- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: చెక్ డ్యామ్‍లపై మీ విజిలెన్స్ విచారణ ఏమైంది?.. సీఎంకు బండి సంజయ్ లేఖ
చెక్ డ్యామ్ లలో అవినీతిపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదంతోనే స్వరాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు దాటినా నేటికీ వీటి విషయంలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో చెక్ డ్యామ్ ల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాసిరకం పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ ధ్వంసమైన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చెక్ డ్యాంల కూలివేతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యాతా ప్రమాణాలు పాటించకుండా చెక్ డ్యాంల కూలిపోవడానికి కారకులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నష్టపోయిన ప్రజధనాన్ని రాబట్టేందుకు సదరు కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేయాలన్నారు. తద్వారా తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదనే సంకేతాలను పంపినట్లవుతుంది. తక్షణమే ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు.
రూ.లక్ష కోట్లకుపైగా వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి ఏమైందో, ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగమైందో మీతోసహా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని తాజాగా తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసమైందన్నారు. 2021 లో వచ్చిన వరదల్లోనూ చాలావరకు కూలిపోయాయి. డిజైన్ లోపం, నాణ్యత సరిగ్గా లేని కారణంగా ప్రజాధనం నీటిపాలైందని ఆరోపించారు. చెక్ డ్యాంల నిర్మాణ పనులపై ప్రజలు అనేక సందేహాలు లేవనెత్తుతూ అనేక ఫిర్యాదులు చేశారని దీనిని ద్రుష్టిలో ఉంచుకుని చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపుపై ఈ ఏడాది మే నెలలో మీరే స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై 57 చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.287 కోట్లు చెల్లించిన దానిమీద మీరు విజిలెన్స్ విచారణ చేయిస్తున్నారు. దురద్రుష్టవశాత్తు ఆ విజిలెన్స్ విచారణ ఏమైందో నేటి వరకు అతీగతీ లేదని విమర్శించారు.
గత బీఆర్ఎస్ పాలనలో చెక్ డ్యాం కాంట్రాక్టులను ప్రస్తుత కాంగ్రెస్ నాయకులే చేజిక్కించుకున్నారని చెక్ డ్యాంల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించలేదని ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తి పడి బీఆర్ఎస్ పాలకులు చెక్ డ్యాంల నిర్మాణ పర్యవేక్షణను గాలికి వదిలేయడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. తనుగుల-గుంపుల వద్ద చెక్ డ్యాం కూలిపోవడంతో ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు దానికి బాధ్యులు మీరంటే మీరంటూ చెక్ డ్యా్మ్ ల వద్దకు వద్దకు వచ్చి డ్రామాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడకుండా నాణ్యతా ప్రమాణాలపై ద్రుష్టి పెట్టి ఉంటే చెక్ డ్యాంలు కూలిపోయే పరిస్థితి వచ్చేది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అక్రమ ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ చెక్ డ్యాంల పరిరక్షణను గాలికొదిలేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీలోని బడా నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఇసుక అక్రమ దందా చేస్తూ దోపిడీని దర్జాగా కొనసాగిస్తున్నారు. చెక్ డ్యామ్ ల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రెండు పార్టీల నిర్లక్ష్యం, కమీషన్ల కక్కుర్తివల్ల రైతులు గోసపడుతున్నారు. నీటి పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల సమీప పంట పొలాల రైతులకు సారవంతమైన నేల నిస్సారంగా మారి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.






