Medaram Jatara 2026 : మేడారం మహా జాతరలో ప్రత్యేక ఆకర్షణగా కోయరాజులు

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-28 11:06:03  IST  )

మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా కోయరాజులు నిలుస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మలను తమ పూర్వీకుల నుంచి పూజిస్తున్నారు.

Medaram Jatara 2026 : మేడారం మహా జాతరలో ప్రత్యేక ఆకర్షణగా కోయరాజులు
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్ : మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా కోయరాజులు నిలుస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మలను తమ పూర్వీకుల నుంచి పూజిస్తున్నారు. మేడారం ప్రాంతం పూర్వకాలం నుంచి కోయదొరలకు నిలయం. ప్రతి జాతర సమయంలో సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిలుకల గుట్ట, మేడారం అడవి ప్రాంతాల నుండి పలు రకాల చెట్ల బెరడు, వనములికలు సేకరించి జాతరలో విక్రయిస్తారు. ప్రతి జాతర సమయంలో భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కలు చెల్లించిన అనంతరం వాళ్లకు ఉన్న రోగ పీడ బాధలు తొలగాలని కోయ దొరలను భక్తులు సంప్రదిస్తారు. వారు నమ్మి వచ్చిన భక్తులకు కనుదిష్ఠి, నరపీడ, ఇంటికి ఉన్న దిష్ఠి దోషాలు, మంత్రతంత్రాల పీడ బాధలు తొలగాలని పూజచేసి వనమూలికలు, తాయత్తులు భక్తులకు అందించడం చేస్తారు. సమ్మక్క సారలమ్మలను నమ్మి కొలిచిన భక్తులకు కోయదొరలు నమ్మకంగా నిలుస్తున్నారు.

MORE NEWS : Medaram Jatara 2026 : మేడారం జాతరలో ఆయుష్ వైద్య సేవలు

Next Story