- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌కు దత్తపుత్రుడ్ని కాదు: కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా కాదని.. కేసీఆర్‌ను జైల్లో వేసేవరకు కల్వకుంట్ల కిషన్ రావు గానే పిలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం లోక్‌సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు. నా పేరు, ఇంటిపేరు మార్చి పిలుస్తున్నారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే మాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. అంత సరదాగా ఉంటే మీరు రేవంత్ ఖాన్‌గా పేరు మార్చుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడానికి మీరు ఎవరు?. మీరు ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం. నేను ఎవరికీ దత్తపుత్రుడిని కాదు. కేసీఆర్‌కు మీకు ఏదైనా ఉంటే.. మీరు మీరు తేల్చుకోండి. మీ విమర్శల మధ్యలోకి నన్ను లాగకండి’ అని కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మహదేవప్ప ఆత్మహత్య ప్రస్తావన
అంతకుముందు.. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడాన్ని కిషన్ రెడ్డి సభలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఇలాంటి దారుణం జరగడం దారుణమన్నారు. ‘గెలవడం ఖాయం.. గెలిచిన తర్వాత కూడా నన్ను అధికార పార్టీ వేధిస్తుందని భార్యతో స్పష్టంగా చెప్పి.. ఎస్టీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఎంపీ తెలిపారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






