- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ సొంత జిల్లాలో దౌర్జన్యాలు.. మహదేవ్ ఆత్మహత్యను లోక్‌సభలో ప్రస్తావించిన కిషన్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్‌లో 6వ వార్డు అభ్యర్థి మహదేవ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం పార్లమెంట్ వరకు చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్‌లో 6వ వార్డు అభ్యర్థి మహదేవ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం పార్లమెంట్ వరకు చేరింది. ఇవాళ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahbubnagar))లో కాంగ్రెస్ నేతలు అనేక రకాలుగా దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను సైతం కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ వేధింపులను తట్టుకోలేకనే, బీజేపీ అభ్యర్థి మహదేవ్ (Mahadev) తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డారని సభ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ఈ పరిణామాలను లోక్‌సభ ఖండించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.






