స్కూల్‌లో దారుణం.. విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-14 05:00:38  IST  )

పాఠశాలలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ విద్యార్థిని స్కూల్ టీచర్ విచక్షణారహితంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

స్కూల్‌లో దారుణం.. విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్
X

దిశ, ఖమ్మం: రెసోనెన్స్ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని స్కూల్ టీచర్ విచక్షణారహితంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన భార్గవ్ 6వ తరగతి విడివోస్ కాలనీ లోని రెసోనెన్స్ స్కూల్ లో చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం విద్యార్థినీ స్కూల్ వార్డెన్ విచక్షణారహితంగా కొట్టాడు. విద్యార్థి రాత్రి కొంత నొప్పితో బాధగా ఉండటంతో తల్లిదండ్రులకు చెప్పాడు. వీపు మీద దెబ్బలు కనిపించడంతో వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉదయం విద్యార్థితో బంధువులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీపు మొత్తం కందిపోయింది‌. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా ఎందుకు కొట్టారు అంటూ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. స్కూల్ ఎదుట నిరసన కార్యక్రమం జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

ఢిల్లీ యూనివర్సిటీ ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు?

Next Story