ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి దౌర్జన్యం

by Kodari Anjali |   (  Updated:2025-12-15 10:50:47  IST  )

ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన భూక్యా ప్రమీల-నాగరాజులు ఓటమి పాలయ్యారు.

ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి దౌర్జన్యం
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన భూక్యా ప్రమీల-నాగరాజులు ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ప్రచారంలో సోమవారం పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లతో గొడవ పడ్డారు. ఫలితాలు రాగానే అర్ధరాత్రి కూడా ఇంటింటికి తిరిగి పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, అర్ధరాత్రి పూట దొంగల్లగా ఇంటింటికి తిరిగారని కాంగ్రెస్ నాయకులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దారుణం.. ప్రత్యర్థి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించిన సర్పంచ్‌ సోదరుడు

Next Story