- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. ప్రత్యర్థి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించిన సర్పంచ్ సోదరుడు
దారుణం.. ప్రత్యర్థి కుటుంబాన్ని ట్రాక్టర్‌తో తొక్కించిన సర్పంచ్ సోదరుడు

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థి కుటుంబాన్ని సర్పంచ్ సోదరుడు(Sarpanch Attacks Opponent Family) ట్రాక్టర్‌తో తొక్కించారు. ఈ ఘటన ఎల్లారెడ్డిపేట మండలం సోమార్‌పేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ అభ్యర్థిని, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ట్రాక్టర్‌తో ఢీకొట్టించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమకు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయొద్దని.. రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని.. తమను ఎవరూ ఏం లేయలేరని ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బీఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి స్థానికులు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి దౌర్జన్యం






