- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
80 ఏళ్ల వయసులోనూ తగ్గని ఉత్సాహం
దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సారపాక గ్రామపంచాయతీకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తేజావత్ సోమూరి గురువారం తన ఓటు హక్కును వినియోగించుకోవడం అందరినీ ఆకర్షించింది. 1945వ సంవత్సరంలో జన్మించిన ఆమె, సారపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఎన్నికలలోనూ తప్పకుండా తన ఓటును నమోదు చేసుకుంటానని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామిని కావడం తనకు చాలా ముఖ్యమని తెలిపారు. అనారోగ్య సమస్యలు, వయోభారం ఉన్నా కూడా, నేటి యువతకు ఆదర్శంగా నిలిచేలా ఆమె ఓటు వేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల వయసులోనూ సోమూరి చూపిన నిబద్ధత అందరికీ స్ఫూర్తినిస్తోంది.
Read More..
భర్తను భుజాన వేసి ఓటు వేయించిన సతి..!
పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓటు కలకలం.. టెండర్ ఓటు వేయించిన అధికారులు






