- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FSL FIRE ACCIDENT: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి 7 మెటీరియల్స్ దగ్ధం: శిఖాగోయల్
ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు దగ్ధం అయ్యాయని జరుగుతున్న ప్రచారం పై ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయల్ కీలక ప్రకటన చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్అగ్నిప్రమాదంపై (FSL Fire Accident) విచారణ జరుగుతోందని ఎఫ్‌ఎస్‌ఎల్ డీజీ శిఖాగోయల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని, నష్టం అంచనాకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇవాళ ఫోరెన్సిక్ లాబొరేటరీస్‍ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఉదయం 10.08 గంటలకు ఎఫ్ఎస్ఎల్‌లో అగ్నిప్రమాదం జరిగిందని, మంటలను మొదట ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి ఒకరు గుర్తించారని చెప్పారు. ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌కు మంటలు వ్యాపించాయని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తే సాధ్యపడలేదన్నారు. మొదట ప్రాపర్టీ రూమ్‌లో పొగ, మంటలు చెలరేగాయని ఆ తర్వాత లైబ్రరీ, హెచ్ఆర్ డీ రూమ్‌కు వ్యాపించాయని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
ఆ కేసుల మెటీరియల్ ఇక్కడ లేదు
అగ్నిప్రమాదం నేపథ్యంలో ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. 2024 పంజాగుట్ట పీఎస్‍లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్‍కు వచ్చాయని ఇందులో 7 మెటీరియల్స్ తాజా ప్రమాదంలో కాలిపోయాయని చెప్పారు వీటిని రిట్రైవ్ చేస్తున్నామని మిగతావన్నీ సంబంధింత అధికారులకు అప్పగించామన్నారు. ఇక 2015లో ఏసీబీ నమోదు చేసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన మెటీరియల్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో లేదన్నారు. ఈ కేసులో 2015లో రెండు విడతల్లో 16 మెటీరియల్ ఆబ్జెక్టులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందాయని అదే సంవత్సరం వాటి నివేదికలను ఏసీబీ కోర్టుకు సమర్పించినట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన 16 వస్తువులు ఇప్పటికే కోర్టుకు తిరిగి అప్పగించినట్టు తెలిపారు.






