- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FSL అగ్నిప్రమాదంలో ఆ 5 గదుల్లోని కీలక ఫైల్స్ దగ్ధం.. FIR కాపీలో సంచలన విషయాలు
ఫోరెన్సిక్ ల్యాప్ లో అగ్నిప్రమాదం ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలను పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‍లో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్‍స్పెక్టర్ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో కీలక విషయాలు పేర్కొన్నారు. 5 గదుల్లోని ఫైల్స్ కాలిపోయినట్లు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్‍తో పాటు కేసు వెరిఫికేషన్ చాంబర్, అనాలసిస్ చాంబర్ కాలిపోయాయని సర్వర్ రూమ్‍లో ఫైళ్లు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. నిన్న ఉదయం సుమారు 10:08 గంటల సమయంలో తాను కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పనిచేస్తున్న క్లాస్-IV ఉద్యోగి సాయి కృష్ణ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆనుకుని ఉన్న ప్రాపర్టీ రూమ్ (మొదటి అంతస్తు) లో మంటలు అంటుకుని అవి ఇతర గదులకు కూడా వ్యాపిస్తున్నాయని తనకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మధ్యాహ్నానికి మంటలు అదుపులోకి:
ఈ సమాచారం అందుకున్న వెంటనే తాను ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వాలని సూచించానని పేర్కొన్నారు. అలాగే కార్యాలయంలో ఉండే అవకాశం ఉన్న ఇతర సిబ్బందిని కూడా సంప్రదించి సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరానని అనంతరం తాను కూడా స్వయంగా కార్యాలయానికి బయలుదేరి10:25 గంటలకు అక్కడికి చేరుకున్నాని తెలిపారు. అప్పటికే కొంతమంది సిబ్బంది మొదటి అంతస్తులో ఉన్న అగ్నిమాపక పరికరాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. 10:30 గంటలకు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు మంటలు, పొగ పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు.
వాటన్నింటికి నష్టం:
రంగంలోకి క్లూస్ టీమ్:
ఈ ప్రమాదంపై ప్రస్తుతం క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను సీజ్ చేసిన క్లూస్ టీమ్, ఎస్ బీ మరోసారి తనిఖీలు చేపట్టింది. అగ్నిప్రమాద సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా? అని అరా తీస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖాగోయల్ ఘటన స్థలానికి చేరుకోనున్నారు. ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోఆమె కీలక ప్రకటన చేయనున్నారు.






