దూకుడు పెంచిన కేసీఆర్.. మరో కీలక సమావేశానికి సన్నాహాలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-21 12:09:26  IST  )

భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సంబురాల ముగింపు వేళ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.

దూకుడు పెంచిన కేసీఆర్.. మరో కీలక సమావేశానికి సన్నాహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సంబురాల ముగింపు వేళ పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం 'తెలంగాణ భవన్' లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ చర్చించనున్నారు. సభ్యత్వాల పునరుద్ధరణ కార్యక్రమంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రజతోత్సవ వేడుకల ముగింపును పురస్కరించుకుని భవిష్యత్ కార్యాచరణను ఈ వేదికగా ప్రకటించే అవకాశం ఉంది.

భారీగా తరలిరానున్న నాయకత్వం..

ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడంతో పార్టీలోని అన్ని స్థాయిల ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో, కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రహస్యమేమీ లేదు.. ఢిల్లీ పర్యటనలపై కుండబద్దలు కొట్టిన హరీష్ రావు: సీఎం రేవంత్‌పై ఫైర్

Next Story