KCR: మరికాసేపట్లో సిట్ విచారణ..నందినగర్‍కు భారీ కాన్వాయ్‍లో బయలుదేరిన కేసీఆర్

by Prasad Jukanti |   (  Updated:2026-02-01 07:04:34  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరుకావడానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.

KCR: మరికాసేపట్లో సిట్ విచారణ..నందినగర్‍కు భారీ కాన్వాయ్‍లో బయలుదేరిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case)సిట్ విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఎర్రవల్లి ఫామ్ హౌస్ (Erravalli Farmhouse), నుంచి హైదరాబాద్‍కు బయలుదేరారు. భారీ కాన్వాయ్ తో కేసీఆర్ నందినగర్ నివాసానికి (Nandinagar) పయనమయ్యారు. కేసీఆర్ రాక నేపత్యంలో పెద్ద ఎత్తున ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‍కు ఆయన బాల్య మిత్రుడు, పార్టీ సీనియర్ నాయకుడు జహంగీర్ మహమ్మద్ రక్షణ చిహ్నం ఇమామె జామిన్ కట్టారు. అనంతరం రోడ్డుమార్గంలో బయలుదేరిన కేసీఆర్.. అభిమానులకు అభివాదం చేశారు. కేసీఆర్ కాన్వాయ్ వెంట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు వాహనాల్లో బయలు దేరారు.

కాగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‍ను నందినగర్‍లోని ఆయన నివాసంలోనే సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ 4 అంచల భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నందినగర్‍లోని కేసీఆర్ నివాసానికి వెళ్లే దారులన్నింటిని పోలీసులు మూసివేశారు. మరోవైపు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో ఆందోళన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

Read More..

Phone tapping case: కేసీఆర్ ఏమైనా దైవాంశ‌సంభూతుడా?.. బీఆర్ఎస్‍ నిరసనలపై ఆది శ్రీనివాస్ ఫైర్

Next Story