- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone tapping case: కేసీఆర్ ఏమైనా దైవాంశసంభూతుడా?.. బీఆర్ఎస్ నిరసనలపై ఆది శ్రీనివాస్ ఫైర్
దుర్మార్గపు పనులు చేసిన ముఠాకు నాయకుడైన కేసీఆర్‍ను విచారణకు పిలిస్తే హడావిడి చేస్తారా? అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

ఇప్పుడు సన్నాయి నొక్కులా?:
అమరవీరుల త్యాగాల ఫలితం త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను నీచపనులతో భ్రుష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దుర్మార్గపు పనులు చేసిన ముటాకు నాయకుుడ కేసీఆర్ అని ఆయనను విచారణకు పిలిస్తే హడావుడి చేస్తారా? ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయడం సహజమని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటే మాపైనే విమర్శలు చేశారని కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవితనే స్వయంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతున్నారన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవంతో మీకేం సబంధం?:
బీఆర్ఎస్ హాయంలో అనేక అక్రమాలు జరిగాయని వాటిపైన విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లేనని మాట్లాడుతున్నారు. తెలంగాణ అంటే అమరవీరుల త్యాగాల ఫలితం అని తెలంగాణ ఆత్మగౌరవం అంటూ మీరెందుకు ముడిపెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. మీ పార్టీ పేరు నుంచే తెలంగాణను తీసేసినప్పుడే తెలంగాణతో మీకు పేగు బంధం తెగిపోయిందని విమర్శించారు. తెలంగాణకు మీరు చేసిందేమి లేదని పదేళ్లు పాలించి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని విచారణ జరిపి వివరాలు రాబట్టాల్సిందేనన్నారు.
Read More..






