- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూకుడు పెంచిన కేసీఆర్.. ఫామ్హౌస్లో కీలక సమావేశం
దూకుడు పెంచిన కేసీఆర్.. ఫామ్హౌస్లో కీలక సమావేశం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. వరుస సమావేశాలతో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) దూకుడు ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కేటీఆర్, హరీష్‌రావుతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, బహిరంగ సభల తేదీలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కేసీఆర్‌కు నోటీస్ జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావునూ విచారించే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తునకు కంక్లూజన్ ఇవ్వాలంటే వీరిద్దరినీ విచారించాల్సిన అవసరముందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే త్వరలో వీరిద్దరికీ సమన్లు జారీ చేసి విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాల అనంతరం సమన్లు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజకీయంగా కేసీఆర్ వేగం పెంచడం హాట్ టాపిక్‌గా మారింది.
Read More..
హరీశ్‌రావు, KTRలను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. హీరో నాగార్జునకు కాంగ్రెస్ నేత వినూత్న లేఖ






