- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash News: కవితకు షోకాజు నోటీసులివ్వనున్న కేసీఆర్?
కేసీఆర్ దేవుడే కానీ.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆదిలోనే ఈ అంశానికి చెక్ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీ క్రమశిక్షణ నియమాల ప్రకారం షోకాజు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: కల్వకుంట్ల వారి ఫ్యామిలీలో అధికారం కోసం పోటీ పెరుగుతుందా అంటే.. ప్రస్తుత పరిణామాలను చూసిన ఎవరైనా అవుననక మానరు. నిన్న కవిత తన తండ్రికి రాసిన లెటర్ వైరలైన విషయం తెలిసిందే. మై డియర్ డాడీ అంటూ రాసిన లేఖలో కవిత.. కేసీఆర్ చేస్తున్న తప్పొప్పుల అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించగా.. దానిపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ పాజిటివ్,నెగిటివ్ అంశాలను లేఖలో ప్రస్తావించారు. కేసీఆర్ దేవుడే కానీ.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆదిలోనే ఈ అంశానికి చెక్ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీ క్రమశిక్షణ నియమాల ప్రకారం షోకాజు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కవిత చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించి షోకాజు నోటీసులు జారీ చేస్తే కవిత ఎలా రియాక్టవుతుందో చూడాలి. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కవిత చేసిన వ్యాఖ్యలపై బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇక కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇంట్లో వేడి తట్టుకోలేక కేటీఆర్ ఇలా ఆరోపణలు చేస్తున్నారని, ముందు తమ పార్టీ సంగతి చూసుకోవాలని సలహాలిస్తున్నారు.
Read More: కవితపై సస్పెన్షన్ వేటు.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంతోష్?.. జోస్యం చెప్పిన అధికార పార్టీ నేత






