- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవితపై సస్పెన్షన్ వేటు.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంతోష్?.. జోస్యం చెప్పిన అధికార పార్టీ నేత
బీఆర్ఎస్(BRS) అంతర్గత వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అంతర్గత వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత లేఖ గురించి తాను పది రోజుల ముందే చెప్పానని అన్నారు. కవిత(Kavitha) చెప్పిన దెయ్యాలు ఎవరో కాదు.. సంతోష్ రావు(Santosh Rao), కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లే అని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. కవితపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు.. నేడో, రేపో ఈ ప్రకటన వింటామని హాట్ కామెంట్స్ చేశారు. సంతోష్‌ను పార్టీ ప్రెసిడెంట్ చేసే అవకాశముందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్(KCR) పరిస్థితి.. జయలలిత లాగా తయారైందని ఎద్దేవా చేశారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుంది.. ఇందులో ఎటువంటి అనుమానం లేదని అన్నారు.
మరోవైపు కవితతో మాట్లాడి సమస్య పరిష్కరించుకునే ఆలోచన కేటీఆర్‌కు కూడా లేదని తెలిపారు. సొంత మనుషులే కేసీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. కుటుంబాన్ని విచ్చిన్నం చేసినా కేసీఆర్ నిస్సహాయుడిగా ఉన్నారు. గతంలో పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే గతంలో అనేకమందిపై కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏం చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్‌తో కవిత భేటీ అవ్వకుండా.. తరచూ సంతోష్ అడ్డుకున్నాడు. కేసీఆర్ ఏం చేయాలో, ఎవర్ని కలవాలో సంతోష్ డిసైడ్ చేస్తున్నారు. కేసీఆర్ దర్శనానికి ఎమ్మెల్యేల దగ్గర సంతోష్ డబ్బులు తీసుకుంటాడని రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.






