- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కవిత సంచలన పోస్ట్! వైరల్
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: (Jubilee Hills by-election) జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)పై నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉత్కంఠ భరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కౌటింగ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘ కర్మ హిట్స్ బ్యాక్’ (కర్మ ఎవరినీ వదిలిపెట్టదు) అంటూ రాసుకొచ్చారు. మరోవైపు దండం పెట్టే ఎమోజీలు పెట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె ఇలా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
తనను పార్టీ నుంచి అవమానించి బయటకు పంపినందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కల్వకుంట్ల కవిత.. కర్మ హిట్స్ బ్యాక్ అని ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. ప్రస్తుతం కవిత ట్వీట్ వైరల్ అవుతోంది. తన ట్వీట్‌పై కామెంట్ల మోత మోగుతోంది. ఆమెకు చాలా మంది సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. కవితక్కతో ఏమి కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు అని తన అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోసం వేసినట్లు ఉందని చాలా మంది నెటిజన్లు సెటైర్లు వేశారు. ‘మీరు 5 నెలలు జైల్లో ఉంటే దాదాపు ప్రతీ రోజు బాధ పడ్డాం.. కానీ మీ నుండి ఇలాంటి ట్వీట్ రావడం బాధాకరం’ అని బీఆర్ఎస్ అభిమాని ట్వీట్ హైలెట్‌గా నిలిచింది.
కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి తనను చాలా అవమానకరంగా బయటకు పంపారని ఆమె గతంలో మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి వేసే ముందు ఖైదీని చివరి కోరిక అడుగుతారని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసే ముందు కనీసం షోకాజు నోటీసు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని తన ఆవేదన బయటపెట్టారు. కేసీఆర్.. తండ్రిగా తనను పిలిస్తే ఇంటికి వెళ్తానని, బీఆర్ఎస్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో తేల్చి చెప్పారు. ట్వీట్ ఇదే..
Read More... జూబ్లీహిల్స్ ఫలితాలపై బీజేపీ చీఫ్ మరోసారి షాకింగ్ కామెంట్స్
‘ఇకనైనా అహంకారం తగ్గించుకుంటే బెటర్’.. జూబ్లీహిల్స్ రిజల్ట్స్‌పై CM రేవంత్ ఫస్ట్ రియాక్షన్






