- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఫలితాలపై బీజేపీ చీఫ్ మరోసారి షాకింగ్ కామెంట్స్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)ల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫలితాల ప్రకటన తర్వాత నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎప్పుడూ గెలవలేదని అన్నారు. ఈసారి తమకు ఓట్లు భారీగా పెరిగాయి. ఎచ్చే ఎన్నికల్లో తప్పకుండా సత్తా చాటుతాం. ఇప్పుడు కూడా.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా.. ఎంఐఎం అభ్యర్థి గెలిచినట్లుగా భావిస్తున్నామని అన్నారు. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. బిహార్‌లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బిహార్ ఫలితాలు భవిష్యత్‌లో దేశమంతా వచ్చే ఫలితాలకు నిదర్శనం. బిహార్‌లో కాంగ్రెస్ కంటే ఎంఐఎం పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బాగుంటుదని దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.






