- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల చిచ్చు.. సీఎంపై కవిత ఫైర్
మిర్యాలగూడ సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని వెలమజాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్లు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ బేధ భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇప్పుడు అవన్నీ మరిచి పోయి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. సీఎం తప్పకుండా ఇలాంటి వైఖరిని మార్చుకోవాలన్నారు.
నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేయ్:
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‍లోకి చేరారని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్‍లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. గాంధీభవన్‍లో అఫిషీయల్‍గా మీటింగ్‍లకు హాజరవుతున్నారని జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ భీ ఫామ్‍లు కూడా ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం సరికాదన్నారు. సంజయ్ కి నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కటం, భవిష్యత్ తరాలకు మంచిది కాదన్నారు. వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
Read More... మీ జాతికే ఆయన ‘జాతిపిత’ ప్రజలకు కాదు.. కేసీఆర్‌పై ధ్వజమెత్తిన సీఎం రేవంత్






