అమీర్‌పేట్ ఫైర్ యాక్సిడెంట్ బాధితులను పరామర్శించిన కవిత

by Ajay Maddhiboyina |

టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అమీర్ పేట్ ఫైర్ యాక్సిడెంట్ బాధితులను పరామర్శించారు. జరిగిన నష్టంపై వ్యాపారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అమీర్‌పేట్ ఫైర్ యాక్సిడెంట్ బాధితులను పరామర్శించిన కవిత
X

దిశ‌, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అమీర్ పేట్ ఫైర్ యాక్సిడెంట్ బాధితులను పరామర్శించారు. జరిగిన నష్టంపై వ్యాపారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫైర్ యాక్సిడెంట్ లో నష్టపోయినవారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారాన్ని సరిగ్గా అంచనావేసి అందించాలని చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన గంటన్నర తరవాత ఫైర్ డిపార్ట్ మెంట్ వస్తే ప్రమాదాలను ఎలా ఆపగలుగుతామని ప్రశ్నించారు.

ఇలాంటి ప్రమాదాలు ఏ క్షణం అయినా జరగవచ్చని, వర్కర్స్ ఉన్నప్పుడు రాత్రి సమయంలో ప్రమాదం జరిగితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. కాబట్టి ప్ర‌భుత్వం ముందుగానే మేల్కుని ఇలాంటి భవనాలను ముందుగానే తనిఖీ చేయాలని చెప్పారు. ముఖ్య‌మంత్రే హోంమంత్రిగా ఉన్నార‌ని కాబ‌ట్టి ఫైర్ డిపార్ట్ మెంట్ పై ప్రత్యేక‌మైన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాల‌ని అన్నారు. ఏ ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగితే, ఏ ప్రాంతంలోని ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్లాలి అనే సందేహాలు లేకుండా చేయాల‌ని చెప్పారు. హైద‌రాబాద్ మ‌ధ్య‌లో ఉన్న అమీర్ పేట్ లో ఫైర్ డిపార్ట్ మెంట్ రావ‌డానికి గంట‌న్నర ప‌డితే ప‌రిస్థితి ఏంటి అని ప్ర‌శ్నించారు. ప్ర‌మాదం జ‌రిగిన ప‌దినిమిషాల్లోనే ఫైర్ డిపార్ట్మెంట్ వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు.

Next Story