మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీని కలిసిన కల్వకుంట్ల కవిత

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-05 10:51:59  IST  )

అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీని కలిసిన కల్వకుంట్ల కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రస్తుతం దేవ్ జీ కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కవిత.. ఆసుపత్రికి వెళ్లి ఆయనను స్వయంగా కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవ్ జీకి అందుతున్న వైద్య సేవల గురించి అక్కడ ఉన్న నిపుణులైన డాక్టర్లతో కవిత మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్.. దేవ్ జీకి మెరుగైన వైద్యం అందించాలని, ఆయన త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులను కోరారు. దేవ్ జీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. కాగా, కొన్ని నెలల క్రితమే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ(62) సుమారు 40 ఏళ్ల అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికి పోలీసుల ఎదుట లొంగిపోవడం ద్వారా జనజీవన స్రవంతిలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Next Story