రామన్నగూడెంలో ‘సర్’ ప్రక్రియ వేగవంతం

by Jakkula.Mamatha |

సర్ దరఖాస్తుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని రామన్నగూడెంలో కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం నిర్వహించారు.

రామన్నగూడెంలో ‘సర్’ ప్రక్రియ వేగవంతం
X

దిశ, ఏటూరు నాగారం: సర్ దరఖాస్తుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని రామన్నగూడెంలో కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం నిర్వహించారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవులపల్లి విజయకుమార్ మార్గదర్శకత్వంలో, పిఎసిఎస్ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరియు బీఎల్ఎ చెన్నూరి బాలరాజు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తు ఫారాలు నింపడంలో సహాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్, ములుగు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్ది రాజ్ కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story