- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: సీబీఐ నోటీసులపై కవిత ఫస్ట్ రియాక్షన్.. సత్యం తోడుగా ఉన్నంత వరకు అంటూ ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులపై కవిత స్పందించారు. లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడం పట్ల జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పందించారు. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు తెలిపారని. సీబీఐ (CBI) నోటీసులపై మా లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసిన కవిత.. 'ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసింది. కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‍ను సైతం ఎంక్వయిరీ చేయాలని సైతం కోర్టు కామెంట్ చేసింది. ఇదంతా మీ అవగాహనలో ఉన్నది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ ఈనెల 16న ఉన్నదన్న విషయాన్నీ సీబీఐ అధికారులు స్వయంగా తెలియ చేశారు. సత్యం నా తోడుగా ఉన్నంత వరకు సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తాను' అని ట్వీట్ చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ!:
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కవితను 2024 మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. ఈ కేసు విచారణ అనంతరం కవితను తిహార్ జైలుకు తరలించారు. అదే ఏడాది ఆగస్టులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందే ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవితను అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. అయితే ఇప్పుడు కవిత బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయి సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సీబీఐ నుంచి మళ్లీ నోటీసులు రావడంతో స్టేట్ పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయనేది వేచి చూడాలి.






