మళ్లీ తెరపైకి లిక్కర్ కేసు.. కవితకు నోటీసులు ఇచ్చిన CBI అధికారులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-12 09:18:21  IST  )

హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి ఇవాళ సీబీఐ అధికారులు వెళ్లారు.

మళ్లీ తెరపైకి లిక్కర్ కేసు.. కవితకు నోటీసులు ఇచ్చిన CBI అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi liquor scam case)లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) నివాసం వద్ద మరోసారి అలజడి మొదలైంది. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ (CBI) అధికారులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో హైకోర్టు జారీ చేసిన నోటీసులను ఆమెకు అందజేసేందుకు వెళ్లారు. అధికారులు కవిత నివాసానికి వెళ్లిన సమయంలో ఆమె అక్కడ అందుబాటులో లేరు. దీంతో సీబీఐ అధికారులు ఆ నోటీసులను ఆమె భర్త అనిల్ (Anil) కుమార్‌కు అందజేశారు. కవిత ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు అందుబాటులోకి వస్తారు అనే వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టుకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కవితతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురికి కూడా సీబీఐ నుంచి నోటీసులు అందాయి. వారిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డి ఉన్నారు.

కాగా, ఢిల్లీ మద్యం విధానం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Delhi Rouse Avenue Court) మాజీ ఎమ్మెల్సీ కవితకు క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే, ఆ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు, తాజా పరిణామాల్లో భాగంగా కవితకు నోటీసులు అందజేశారు.

Kavitha: సీబీఐ నోటీసులపై కవిత ఫస్ట్ రియాక్షన్.. సత్యం తోడుగా ఉన్నంత వరకు అంటూ ట్వీట్

Next Story