TRS : కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎటాక్

by Prasad Jukanti |   (  Updated:2026-04-25 06:16:35  IST  )

తెలంగాణ రాజకీయాల్లో 'తెలంగాణ రాష్ట్ర సేన' పేరుతో కొత్త పార్టీని కవిత ప్రకటించారు. కవిత పార్టీపై అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

TRS : కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎటాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇవాళ కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ దారి తప్పారని ఇక ఆయన మన మనిషి కాదు మరమనిషి అంటూ దుయ్యబట్టగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో హిట్లర్ పాలన కొనసాగుతోందని విమర్శించారు.

కాంగ్రెస్ ఎటాక్:

కవిత ప్రకటించిన కొత్త పార్టీపై రాష్ట్రంని అధికార కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. బీఆర్ఎస్ తోక పార్టీనే కవితక్క ప్రారంభించిన ఈ కొత్త పార్టీ (తెలంగాణ రాష్ట్ర సేన) అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. తలా తోక ఎప్పటికీ ఒక్కటేనని బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే తనయ టీఆర్ఎస్.. అంతా గ్యాస్ అంటూ సెటైర్ వేశారు.

‘ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!’.. కవిత పార్టీపై బీఆర్ఎస్ కౌంటర్

Next Story