- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొడ్డి దారిన చైర్మన్ పోస్ట్ కొట్టేయడానికి స్కెచ్.. మంత్రి సీతక్క శాఖపై కవిత సంచలన ఆరోపణలు
స్త్రీనిధి సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని ఎండీ గుత్తాధిపత్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటునివ్వాల్సిన స్త్రీనిధి (Stree Nidhi) సంస్థ అక్రమార్కులకు అడ్డాగా మారిందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. రిటైర్ అయి 14 ఏళ్లవుతున్నా సంస్థను తన గుత్తాధిపత్యంలో పెట్టుకొని అనేక అక్రమాలకు కారకుడైన ఎండీ ఇప్పుడు దొడ్డి దారిన సంస్థ ఎక్స్ అఫీషియో చైర్మన్ పోస్ట్ కొట్టేయడానికి స్కెచ్ వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈనెల 16న స్త్రీనిధి ఉద్యోగుల సమావేశంలో ఎక్స్ అఫీషియో చైర్మన్ పోస్ట్ కొట్టేయడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈనెల 23తో సంస్థ ఎండీగా కాలపరిమితి ముగుస్తుండటంతో ఎలాగైనా సంస్థను తన చెరలోనే ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులను దొడ్డిదారిలో కీలక పోస్టుల్లో కొనసాగించేందుకు ఎంతకైనా దిగజారడం విచారకరం అన్నారు. తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై మంత్రి సీతక్క స్పందించి స్త్రీనిధిలో అక్రమాలకు కేంద్ర బిందువైన సంస్థ ఎండీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్త్రీనిధిలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరిగేలా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు.






