- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్త్రీనిధి లో పన్నెండేండ్లుగా ఒకే ఒక్కడు!
స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లో పన్నెండేండ్లు గా ఒకే అధికారి ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు.

దిశ, తెలంగాణ బ్యూరో: స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లో పన్నెండేండ్లు గా ఒకే అధికారి ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్త్రీనిధి లో ఐదుగురు ఎండీలు మారినా.. తెలంగాణలో మాత్రం 2011 నుంచి ఎండీగా విద్యాసాగర్ రెడ్డి ఒక్కరే కొనసాగుతున్నారు. ఈయన నాబార్డ్ లో ఏజీఎం కేడర్‌లో వీఆర్ఎస్ తీసుకుని సెర్ప్ లో 2009లో కన్సల్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో అదనపు బాధ్యతలు చేపట్టి 2011లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. రెండేండ్ల కాంట్రాక్టుపై స్త్రీనిధికి వచ్చిన విద్యాసాగర్‌రెడ్డి.. 2022లో తన రిటైర్మెంట్ వయసు దాటినా కుర్చీ వదలడం లేదు. ఎలాంటి ఆర్డర్ లేకుండా కొనసాగుతున్న ఆయన.. నెలకు రూ. 3 లక్షల వేతనం పొందుతున్నట్లు సమాచారం.
అక్రమాల ఆరోపణలు..
ఎండీ విద్యాసాగర్ రెడ్డి హయాంలో స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం రూ.328 కోట్ల టర్నోవర్ దాటిన ప్రభుత్వ సంస్థలు ఐఏఎస్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉండాలి. కానీ రూ.5,400 కోట్ల టర్నోవర్ ఉన్న స్త్రీనిధికి ఎండీగా రిటైర్డ్ అధికారిని కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా స్త్రీనిధి సహకార సంఘాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
నిధులన్నీ పాలకుర్తికే..
గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గానికి సీఎస్ఆర్ నిధులను పెద్దఎత్తున కేటాయించారని ఆరోపణలున్నాయి. తన పదవిని కొనసాగించినందుకు ఈ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అసలు బండారం బయటపడుతుంది.
ఉద్యోగులపై వేధింపులు?
ఎండీ విద్యాసాగర్ రెడ్డి.. ఇష్టం లేని సిబ్బందిని పక్కనబెట్టడం, లేదంటే రాజీనామా చేసేలా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్త్రీ నిధిలో 2020 వరకు 520 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 350 కి తగ్గింది. ఈ 170 మందిలో చాలా మంది ఎండీ వేధింపులు తట్టుకోలేకనే రిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సర్వీస్ రూల్స్ వర్తింపజేయకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. వేతనాలను సవరించి యూజర్ ఫ్రెండ్లీ అటెండెన్స్ ప్రవేశపెట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.






