బోడుప్పల్‌లో జల యుద్ధం..

by Batti.Sumithra |

బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని రా చెరువు లోతట్టు ప్రాంతంలో తాగునీటితో పాటు బోర్ నీటికీ తీవ్ర కొరత ఏర్పడింది.

బోడుప్పల్‌లో జల యుద్ధం..
X

దిశ, మేడిపల్లి : బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని రా చెరువు లోతట్టు ప్రాంతంలో తాగునీటితో పాటు బోర్ నీటికీ తీవ్ర కొరత ఏర్పడింది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మంచినీటి పైప్‌లైన్లలో తరచూ లీకేజీలు, మరమ్మతుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రా చెరువు ప్రాంతానికి చెందిన వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు సహా సుమారు 100 మంది మాజీ కార్పొరేటర్ రసాల వెంకటేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ శైలజ, తహసీల్దార్, జలమండలి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Next Story