ఇస్నాపూర్‌లో రెండు బస్సులు ఢీ

by Taduka Kalyani |

పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ జాతీయ రహదారిపై శనివారం రెండు బస్సులు ఢీ కొనడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ఇస్నాపూర్‌లో రెండు బస్సులు ఢీ
X

దిశ, పటాన్‌చెరు టౌన్ : పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ జాతీయ రహదారిపై శనివారం రెండు బస్సులు ఢీ కొనడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ముందుగా వెళ్తున్న ఓ ప్రైవేటు కళాశాల బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయాలు స్వల్పంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతినగా, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన స్థలానికి చేరుకున్న పటాన్‌చెరు పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.

Next Story