- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్ వేముల చట్టం ఇంకెప్పుడు వస్తుంది.. రాహుల్ గాంధీకి కవిత సూటి ప్రశ్న
కోదాడలో జరిగిన దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ కు కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కోదాడలో జరిగిన దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ కు కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు కవిత ఎక్స్ రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోలీసు కస్టడీలో కొడుకును కోల్పోయిన తల్లి రోదనను వినాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత దళితులపై దాడులు పెరుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యిందని రోహిత్ వేముల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రేమను మాటల ద్వారా కాదని, చర్యల ద్వారా చూపించాలన్నారు. రోహిత్ వేముల చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని, రాజేష్ కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE ....
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు ఉపాధ్యాయులకు కోటి బీమా అందజేయాలి.. కవిత డిమాండ్






