- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు ఉపాధ్యాయులకు కోటి బీమా అందజేయాలి.. కవిత డిమాండ్
సూర్యాపేట జిల్లా అర్వపల్లి శివారులో జరిగిన కారు ప్రమాదంపై మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. రోడ్డు ప్రమాదం ఇద్దరు ఉపాధ్యాయులను బలి తీసుకోవడం అత్యంత విషాదకరం అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా అర్వపల్లి శివారులో జరిగిన కారు ప్రమాదంపై మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. రోడ్డు ప్రమాదం ఇద్దరు ఉపాధ్యాయులను బలి తీసుకోవడం అత్యంత విషాదకరం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. కోటి బీమా కల్పిస్తామని సీఎం ప్రకటన చేశారే తప్ప విధివిధానాలు ఖరారు చేయలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కష్టపడుతున్నారని చెప్పారు. వారికి ఉద్యోగ భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదన్నారు. విధి వక్రించి వారికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు కనీస భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేజీబీవీ టీచర్లు, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. కోటి బీమా సదుపాయం కల్పించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ టీచర్ తో పాటు కేజీబీవీ ఎస్ఓ కు రూ. కోటి బీమా అందజేయాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రూ. కోటి బీమాపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కల్పన, గీతారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన మిగతా ఇద్దరు టీచర్లు కోలుకొని క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షించారు.
READ MORE ....






