- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్న ఇలాకాకు చెల్లి
అన్న కేటీఆర్ ఇలాకాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనుంది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : అన్న కేటీఆర్ ఇలాకాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనుంది. జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత ఈనెల 6, 7వ తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా మండలాల్లో పర్యటించనున్నట్లు, టూర్ కి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ సైతం విడుదలైనట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కవిత సిరిసిల్ల పర్యటన షెడ్యూల్ వివరాలు
కవిత తన పర్యటనలో భాగంగా మొదట నేరెళ్ల ఇసుక ఘటన బాధితులతో భేటీ కానున్నట్టు, అక్కడి నుంచి తంగళ్ళపల్లి బీడీ కార్ఖానా, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సందర్శన, మల్కపేట రిజర్వాయర్ భూ నిర్వాసితులు, వీర్నపల్లి మండలంలో లవోణి, పోడు భూముల బాధితులతో భేటీ, అదే మండలంలో జాగృతిలో చేరికలు, ఎల్లారెడ్డిపేట కేంద్రంతో పాటు రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో మహిళతో భేటీ కానున్నారు. రెండో రోజు వేములవాడ రాజన్న దర్శన అనంతరం కూరగాయల మార్కెట్ సందర్శన, తదానంతరం సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకాళాకారుడి మగ్గం సందర్శన, మిడ్ మానేరు భూ నిర్వాసితులు, నాంపల్లి వడ్డెర కులస్తులు, అగ్రహారం భూ బాధితులతో భేటీ, జేఎన్టీయూ కళాశాల విద్యార్థులతో చర్చ, చంద్రగిరి గ్రామస్తులతో మాట ముచ్చట, గంభీరావుపేట మండలం లింగన్నపేట బ్రిడ్జి, నర్మల డ్యామ్ పెండింగ్ పనులు, ముస్తాబాద్ డంపింగ్ యార్డ్ పెద్ద చెరువు సందర్శనతో టూర్ ముగియనుంది. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు.
ఏమి మాట్లాడుతుందోననేది సస్పెన్స్
అయితే సుదీర్ఘ కాలం తర్వాత సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తున్న కవిత ఏం మాట్లాడుతుందోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కవిత తన పర్యటనలో భాగంగా జిల్లాలోని ప్రధాన సమస్యలతో పాటు, బి.ఆర్.ఎస్ ప్రభుత్వ గత పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేటీఆర్, సంతోష్ రావులు చేసిన అరాచకాలను బయట పెట్టే అవకాశం ఉందని, ఆమె షెడ్యూల్ ను చూస్తేనే అన్న కేటీఆర్ తో పాటు మిగతా బి.ఆర్.ఎస్ పార్టీ లీడర్లను టార్గెట్ చేసి పక్కా ప్లాన్ తో సిరిసిల్ల గడ్డపై కవితమ్మ అడుగుపెడుతున్నట్లు జిల్లావ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ మొదలైంది. ఇప్పటివరకు అన్న కలవకుండా తారకరామారావు పై నోరు మేదుకొని కవిత ఏం మాట్లాడుతుందో వేచి చూడాల్సి ఉంది ...! మరోవైపు సిరిసిల్లలో ఎమ్మెల్సీ కవిత పర్యటన తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు సమాచారం..






